People need to see it without any trouble

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి

Date:04/04/2020

రామసముద్రం ముచ్చట్లు:

కరోనా వైరస్ నివారణలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాష అన్నారు.మండలంలోని చెంబకూరులో ఆయన శనివారం పర్యటించి ఉచితంగా రేషన్ సరుకులు, ప్రభుత్వం అందిస్తున్న1000 రూపాయల సాయం లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల పంపిణీ లో ఎలాంటి అలసత్వం వద్దని అధికారులకు సూచించారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమికఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల నిలువలు గురించి అడిగి తెలుసుకున్నారు. ్రభుత్వ ప్రాథమిక వైధ్యశాలకు వెల్లి తణఖి నిర్వహించారు. అలాగే వైధ్యశాలలో మందులు నిల్వగురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లో డాక్టర్ పనితీరు వైద్య సేవలపై పలువురు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపిడివో శ్రీనివాసులు, ఇంచార్జ్ తహశీల్దార్ దేవరాజ్, సిఐ మధుసూదనరెడ్డి, ఎస్సై రవికుమార్, ఎఎస్సై రామక్రిష్ణ, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, సచివాలయం సిబ్బంది, వాలంటిరీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌, కార్మికులకు భోజనం అందిస్తున్న కొండవీటి

Tags: People need to see it without any trouble

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *