భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి

– నిరంతరాయంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు
– 4 టీమ్స్, 3 స్పెషల్ పార్టీ యూనిట్ లు రోప్స్, ఇతర పరికరాలతో ఎల్లప్పుడూ సిద్ధం
రామగుండం సీపీ వి.సత్యనారాయణ

పెద్దపల్లి   ముచ్చట్లు:

రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిది మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రామగుండము పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ తగు సూచనలు సలహాలు మరియు ఆదేశాలు జారీ పోలీస్ అధికారులకు, సిబ్బందికి చేయడం జరిగినది. గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు అవకాశం ఉంది ,రహదారుల పైన  కల్వర్టులు ఉన్నచోట నీటి ప్రవాహం అంచనా వేసి జాగ్రత్తగా వెళ్ళవలసినదిగా సదరు కల్వర్టులు, నీటి ప్రవాహం వల్ల డ్యామేజ్ ఉండవచ్చు కనుక గమనించగలరు, చెరువులలో ఇంతకు ముందు తీసిన గుంతలలో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మండల పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, చిన్న పిల్లలు అటువైపు వెళ్ళకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండము  కమిషనరేట్ పోలీసులు విన్నవిస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, మరియు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, త్రెడ్ మరే ఇతర పరికరాలు అడ్డంపెట్టి సంబంధిత గ్రామాల సర్పంచులకు మరియు అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ప్రజలు తెలియజేయాలని సూచించారు.
పోలీస్ అధికారులు ఆయా గ్రామాల సర్పంచులు మరియు ప్రజా ప్రాధినిధులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకొని ప్రమాద నివారణ చర్యలను చేపట్టడానికి సిద్దంగా వుండాలని సూచించారు. పట్టణాలలో గ్రామాలలో మట్టితో కట్టిన పురాతన ఇండ్ల గురించి సమాచారం తెలుసుకుని, ఇండ్లు కూలే ప్రమాదంలో ఉంటే సంబంధిత అధికారుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కావున అలాంటి ఇళ్ళల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  తెలిపారు. ముఖ్యంగా చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు వాగులు నదులు ఉధృతిని అంచనా వేస్తూ వరద ముంపు కు గురయ్యే గ్రామాలలో టామ్ టామ్ వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని  పోలీస్ అధికారులకు సిపి సూచించారు.
ప్రస్తుత పరిష్టితుల్లో వాగులు చెరువులు కుంటలు వర్షపు నీటితో నిండిన క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కుటుంబ సభ్యులను వాగులు చెరువులు కుంటలను తిలకించేందుకు ఎవరు వెళ్లవద్దని సూచించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిర్విరామంగా కురిసే వర్షాల కారణంగా విద్యుత్ స్థంబాలకు ఎర్థింగ్ ద్వారా విధ్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలే అవకాశం వున్నందున ప్రజలు పిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్థంబాలను కానీ విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా జాగ్రత్తగా వుండాలని, అలాగే విధ్యుత్ సరఫరా లో ఏదైనా లోపం ఉంటే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని లేదా వరత ఉద్ధృతి ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే డయల్ 100, స్థానిక పోలీస్ అధికారుల నెంబర్లకు సమాచారం అందింస్తే తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని సిపి తెలిపారు. ఓఎస్డీ, డీసీపీ లు, ఏసీపీ లు సీఐ లు ఎస్ఐ లు హెడ్ క్వార్టర్స్ లో ఉండి ఏప్పటికి అప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:People should all be vigilant in view of heavy rains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *