గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి

People should be educated at village level

People should be educated at village level

Date:16/04/2018

పలమనేరు ముచ్చట్లు:

రాష్ట్ర నికి జరుగుతున్న అన్యాయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పలమనేరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగదీశ్ నాయుడు కోరారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ మండలం పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  అమరనాథ రెడ్డి  సహకారం తో మండల పరిధి లోని జగమర్ల ST కాలనీ లో రోడ్డు నిర్మాణం కోసం రూ.5 కోట్ల 39 లక్షలు, మాదిగ బండ రోడ్డు కు రూ,57లక్షలు, కురపల్లి నుండి జల్లిపేట వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.1 కోటి 08లక్షలు, పెంగరగుంట OHSR ట్యాంక్ నిర్మాణం కోసం రూ.15 లక్షలు, బయ్యప్పగారిపల్లి OHSR ట్యాంక్ నిర్మాణం కోసం రూ.15 లక్షలు,కొలమాసనపల్లి పంచాయతీ బెలుపల్లి క్రాస్ OHSR ట్యాంక్ నిర్మాణము కోసం రూ.15 లక్షలు ,మొత్తం రూ.7 కోట్ల 65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రధాన కార్యదర్శి మల్లీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల20 వతేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే నిరాహారదీక్షకు మద్దతు గా పలమనేరు లో కూడా నిరాహారదీక్ష లో ప్రతి ఒక్కరు పాల్గొన్నలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు వెంకటరత్నం, రాష్ట్ర రైతు నాయకులు సుబ్రమణ్యం నాయుడు,అన్ని గ్రామ పంచాయితీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు,నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

 

Tags: People should be educated at village level

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *