ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకునేలా చైత‌న్య‌ప‌రచాలి: వెంక‌య్య‌నాయుడు

న్యూఢిల్లీ  ముచ్చట్లు :
స్థానిక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను వ్యాక్సిన్ తీసుకునేలా చైత‌న్య‌ప‌రచాల‌ని ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు సూచించారు. కొత్త‌గా ఎన్నికైన‌.. మ‌ళ్లీ నామినేట్ అయిన రాజ్య‌స‌భ ఎంపీలు ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో ఇవాళ న‌లుగురు ఎంపీలు ప్ర‌మాణం చేశారు. కేర‌ళకు చెందిన జ‌ర్న‌లిస్టు జాన్ బ్రిటాస్‌, సీపీఎం నేత వీ శివ‌దాస‌న్‌, సీనియ‌ర్ అడ్వ‌కేట్ మ‌హేశ్ జెఠ్మ‌లానీ, బీజేపీ నేత స్వ‌ప‌న్ దాస్‌గుప్తాలు రాజ్య‌స‌భ ఎంపీలుగా ప్ర‌మాణం చేశారు. నూత‌న స‌భ్యుల‌కు చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు కంగ్రాట్స్ తెలిపారు. శీతాకాల స‌మావేశాల స‌మ‌యంలో త‌న ఛాంబ‌ర్‌లో ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల‌కు మ‌నపై అనేక ఆశ‌లు ఉంటాయ‌ని తెలిపారు. ప్ర‌జాజీవితంలో ఉండే మ‌న స‌భ్యులంతా అత్యున్న‌త ప్ర‌మాణాలు పాటించాల‌న్నారు. రీనామినేట్ అయిన స‌భ్యులకు స‌భా వ్య‌వ‌హారాలు తెలుసు అని, కొత్త‌గా నామినేట్ అయిన వారు రాజ్య‌స‌భ పుస్త‌కాల‌ను, రూల్ బుక్స్‌, ప‌బ్లికేష‌న్స్‌ను ఓ సారి చ‌ద‌వాల‌న్నారు. సీనియ‌ర్ స‌భ్య‌ల గైడెన్స్ తీసుకోవాల‌న్నారు. పార్ల‌మెంట‌రీ క‌మిటీల్లో స‌భ్యుత్వం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:People should be encouraged to get vaccinated: Venkaiah Naidu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *