ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి-వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి

పెద గంట్యాడ ముచ్చట్లు :

 

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనీ వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాలు మేరకు వైసీపీ 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఆద్వర్యంలో నియోజక వర్గం లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రి లో సిబ్బందికి మాస్క్ లు, గ్లౌజ్ లు, సోప్స్, సానిటైజర్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవన్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటములకు సంబంధం లేకుండా కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ధర్మాల శ్రీనివాసరావు ను ఆయన అభినందించారు. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్పొరేటర్ లుగా గెలిచిన కొందరు ఇళ్ళకే పరిమిత మయ్యరని ఆరోపించారు. 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా సేవలు ప్రజలకూ అందిస్తున్నామని, నిత్యం ప్రజల్లో ఉండే వాడే నాయకుడని అని అన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసం ఉన్న అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్య క్రమం లో డాక్టర్ రమేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

బీజీపీ వైపు ఈటెల అడుగులు

 

Tags: People should be vigilant – YCP glass in-charge Tippala Devan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *