Natyam ad

పుంగనూరులో కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలో కరోనా వ్యాప్తి తీవ్రమౌతున్న తరుణంలో పట్టణ ప్రజలందరు ఐకమత్యంతో నియంత్రించేందుకు సహకరించాలని కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ కోరారు. శనివారం మున్సిపాలిటిలో పట్టణ వ్యాపారులు, ప్రముఖతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణానికి వచ్చిపోయే వారు విధిగా మాస్క్లు ధరించాలని, షాపుల్లో నోమాస్క్ నో ఎంట్రి విధానాన్ని అవలంభించాలని సూచించారు. అలాగే వ్యాపార కేంద్రాల్లో శానిటైజర్లు వినియోగించాలన్నారు. మాస్క్లు లేకున్నా, శానిటైజర్లు వినియోగించకపోయినా జరిమానాలు విధిస్తామన్నారు. విరుద్ధంగా ప్రవర్తించే వ్యాపార లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. వీటితో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రబాబు, వ్యాపారులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; People should cooperate for corona control in Punganur