People should cooperate to control the corona

కరోనాను నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలి

– వైఎస్‌ఆర్‌సీపి రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌రెడ్డి

Date:23/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో కరోనా వ్యాదిని నివారించేందుకు ప్రతి ఒక్కరు సహకరించి తమంతకు తాముగా స్వీయనిర్భంధంలో ఉండాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పుంగనూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరులో జనతాకర్ఫ్యూను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలకు, ప్రజలకు కృత జ్ఞతలు తెలిపారు. కరోనా నివారణకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ, ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు , తహశీల్ధార్‌ వెంకట్రాయులు , సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది , పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు. వ్యాదిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పోరాటం చేయాలన్నారు.మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తం కావాలన్నారు. ప్రజలు బాధ్యతగా ఈ నివారణ చర్యల్లో పాల్గొనాలని , ప్రతి ఒక్కరు ఇండ్లకు పరిమతం కావాలన్నారు. ముఖ్యంగా పిల్లలను, వృద్ధులను బయట పంపరాదని సూచించారు. అవసరమైన సమయాల్లో మినహా ఏ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రెడ్డెప్ప, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఐకమత్యంతో కరోనాపై దాడి చేయాలి 

Tags: People should cooperate to control the corona

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *