ప్రజలు న్యాయం, చట్టంపట్ల అవగాహన పెంపొందించుకోవాలి

People should develop a sense of justice and legislation - Senior Civil Judge Babunayak

People should develop a sense of justice and legislation - Senior Civil Judge Babunayak

Date:22/09/2018

– సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌

పుంగనూరు ముచ్చట్లు:

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ముఖ్యంగా చట్టం, న్యాయం పట్ల అవగాహన పెంచుకుని తమ తమ హక్కులను కాపాడుకునేందుకు చైతన్యవంతులుకావాలని పుంగనూరు సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ పిలుపునిచ్చారు.

 

శనివారం ఆయన అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి రమణారెడ్డి, న్యాయవాదుల సంఘ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి , తహశీల్ధార్‌ మాదవరాజుతో కలసి సుగాలిమిట్ట, అడవినాథునికుంట గ్రామాల్లో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు.

 

అలాగే మోడల్‌స్కూల్‌ హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ మాట్లాడుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మౌలానాజునైద్‌ అహమ్మద్‌ ఆదేశాల మేరకు న్యాయవిజ్ఞాన సదస్సులు, లోక్‌అదాలత్‌ను నిర్వహించడం జరిగిందన్నారు.

 

న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే లోక్‌అదాలత్‌ను నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు రాజీ విధానాన్ని చేపట్టాలన్నారు.

 

హాస్టల్‌లో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమకు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు , కక్షిదారులు, అధిక సంఖ్యలో హాజరైయ్యారు.

 

జాతీయ క్రీడలకు పుంగనూరు వేదిక కావాలి

Tags:People should develop a sense of justice and legislation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *