ప్రజలు ఒత్తిడికి లోనుకాకుండ జాగ్రత్తలు తీసుకోవాలి 

పుంగనూరు ముచ్చట్లు:

ప్రస్తుత పరిస్థితులలో ఎవరు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనుకాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని , ప్రజల జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మధుసూదనచారి పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ మానసిక ఒత్తిడి దినోత్సవంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బంది , రోగులతో కలసి ఒత్తిడి తగ్గించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాహుల్‌, హిమశైలజ, జశ్వంత్‌, శ్రీనివాసులు, ప్రశాంత్‌, రవి, రామాంజులు నాయక్‌, హరగోపాల్‌నాయక్‌తో పాటు సిబ్బంది , రోగులు పాల్గొన్నారు.

 

Tags: People should take care not to get stressed

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *