విద్యుత్ కోతలుతో ప్రజలు ఇక్కట్లు
ఇచ్చాపురం ముచ్చట్లు:
ఇచ్ఛాపురం లో గత నాలుగు రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు వల్ల ప్రజలు అనేక ఇక్కట్ల కి గురవుతున్నారు. ఒక వైపు మండుతున్న ఎండలు మరోవైపు విద్యుత్ కోతలు తో ప్రజలు ఉక్కపోతల కు తల్లడిల్లుతున్నరు. రోజు రోజుకీ సూర్యడు ప్రచండ గాలులు కి ఇంట్లో ఉండలేక బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి కోతలు లేవని ప్రకటనలు ఇస్టున్న ఇచ్ఛాపురం లో మాత్రం వేల పాల లేకుండ విద్యుత్ కోతలు విధించడం వల్ల అధికారుల తీరు పై మండిపడుతున్నారు. గతంలో కనీసం కోతలు విధించే వేళలు ముందుగ మీడియా ద్వార సమాచారం ఉండేది.. ఇప్పుడు అధికారులు మాత్రం వారి ఇష్టానుసారంగా కోతలు విధిస్తు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు వల్ల ఇళ్లలో ఉన్నా ఫ్యాన్లు లైట్లు, ac లు,tv లు కాలిపోతున్నయి . ప్రజలు నుండీ తిరుగుబాటు రాకముందే అధికారులు తీరు లో మార్పు రావాలి పలువురు కోరుతున్నారు.
Tags: People suffer due to power cuts