చలి కారణంగా రోగాల బారిన పడుతున్న ప్రజలు

Date:11/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు వణికిపోతున్నారు. విపరీతమైన చలి కారణంగా రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనూ ప్రమాదకర స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాపిస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో కేవలం పది రోజుల్లోనే 83 మందికి స్వైన్ ఫ్లూ సోకింది. వీరంతా నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనవరి 1 నుంచి పదో తేదీ వరకు 483 మంది శాంపిల్స్ ను పరీక్షించగా వీరిలో 83 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని వెల్లడైంది. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది వరకు వస్తుంటారు. అయితే చలి పెరిగిన కారణంగా ప్రస్తుతం వెయ్యి మందికి పైగా వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గితే ఫ్లూ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
Tags:People suffering from cold and cold

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *