Natyam ad

పుంగనూరులో శ్రీసుగుటూరు గంగమ్మ జాతరకు క్రిక్కిరిసిన జనం

– వేకువజామున నిమజ్జనం

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

జమీందారుల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను వేలాది మంది భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. బుధవారం పట్టణంలో జరిగిన జాతరకు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రర్ఖా•ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పట్టణం భక్తులతో పోటేత్తింది. కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, చైర్మన్‌ అలీమ్‌బాషా, డిఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ఉదయం జమీందారి కుటుంబీకులు తొలిపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఆలయంలో దర్శనానికి అనుమతించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండ బ్యారీకెడ్లు నిర్మించారు. అలాగే వేసవి తీవ్రంగా ఉండటంతో ఆలయం ప్రాంగణం వద్ద చలువ పందిళ్లు, షామియానాలు వేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. వీటితో పాటు వైద్యశిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చి ల వేషధారణలో గెరిగెలు తీసుకొచ్చి, అమ్మవారికి వెహోక్కులు చెల్లించుకున్నారు. అలాగే జంతుబలులు సమర్పించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

 

నిమజ్జనం…

రెండు రోజుల పాటు జరిగిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర బ్యుధవారం రాత్రి వైభవంగా ముగిసింది. అమ్మవారికి జమీందారులు మలిపూజలు నిర్వహించారు. రాత్రి పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహించి, గురువారం వేకువజామున నిమజ్జనం చేసి, అమ్మవారిని జమీందారులకు అప్పగించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేలాది మంది పూజలు చేశారు.

    

Tags; People throng Srisuguturu Gangamma fair in Punganur

Post Midle