Natyam ad

వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

అమరావతి  ముచ్చట్లు:


 రాష్ట్రంలో ఎండ ప్రభావం అధికంగా ఉంది. భానుడి ప్రతాపం ఓ వైపు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రతపై ఏపీ విత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తూనే ఉంది. ప్రతీరోజు ఏయే ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందో ప్రజలకు తెలియజేస్తోంది. వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచనలు చేశారు.

 

Tags; People were suffocated by hailstorms

Post Midle
Post Midle