ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ మట్టిలో కలిపారు

People's aspirations are included in KCR

People's aspirations are included in KCR

-తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాట తప్పారు
-టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల పార్టీ
Date:17/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్… మాట తప్పారని బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలన్నింటినీ మట్టిలో కలిపిన కేసీఆర్ కు… ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదని అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను భ్రమిత్ షా అంటూ కేసీఆర్ కుటుంబసభ్యులు అంటుండటం… వారి అహంకారానికి, అవివేకానికి నిదర్శనమని చెప్పారు. బీజేపీని జూటా పార్టీ అనడం కేటీఆర్ అవివేకానికి ఉదాహరణ అని అన్నారు.
బీజేపీ జూటా పార్టీ అయితే… టీఆర్ఎస్ తెలంగాణ రజాకార్ల పార్టీ అవుతుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని… అందుకే తమ పార్టీని అన్ని పార్టీలు టార్గెట్ చేశాయని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో సభలను నిర్వహిస్తామని చెప్పారు.
Tags: People’s aspirations are included in KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *