23నుంచి నెల్లూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర

People's movement in Nellore district from 23

People's movement in Nellore district from 23

సాక్షి

Date :17/01/2018

సాక్షి, నెల్లూరు : ఈ నెల 23 నుంచి నెల్లూరు జిల్లాలో  ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టనున్నారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్రపై చర్చించేందుకు పార్టీ నేతలు బుధవారం ఇక్కడ భేటీ అయ్యారు. నెల్లూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో జగన్‌ పాదయాత్ర మార్గాన్ని ఖరారు చేస్తారు.  పాదయాత్ర సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ సీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కోసం ప్రజలు వేచి చూస్తున్నారని పేర్కొన్నారు.  కాగా ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి..  జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యే వరకూ తీసుకోవాల్సిన చర్యలపై  సూచనలు చేస్తారు. మొత్తం పది నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. ఈ నెల 21 తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఎప్పుడైనా ప్రజాసంకల్పయాత్ర జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించనుంది.

కాగా గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కర్నూలు, అనంతపురం జిల్లాలను దాటుకుంటూ ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.

Tags : People’s movement in Nellore district from 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *