ప్రజల సమస్యలను పరిష్కరించాలి

Date:07/01/2019
సిరిసిల్ల ముచ్చట్లు:
డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణిల ద్వారా వచ్చే ప్రజల అర్జీలను సాధ్యమైనంత త్వరగా  పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి  ఎన్ . ఖీమ్యా నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డయల్యువర్ కలెక్టర్, ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించారు.  ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు ,వినతులు స్వీకరించారు . జిల్లా నలుమూలల నుండి మొత్తం 240 అర్జీలు వచ్చాయి . వాటిలో రెండు పడక గదుల ఇళ్ళ మంజూరు కోరుతూ 183 , పెన్షన్ లు మంజూరు కోరుతూ  24 , రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ  33  అర్జీలు వచ్చాయి. డయల్ యువర్ కలెక్టర్ కు  4 ఫోన్ కాల్ ఫిర్యాదులు వచ్చాయి . ఆర్జీల స్వీకరణ అనంతరం జిల్లా రెవిన్యూ అధికారి ఖీమ్యా నాయక్  మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, గుణాత్మక పరిష్కారం చూపాలన్నారు .
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై శాఖల వారీ గా సమావేశాలు ఏర్పాటు చేసుకుని త్వరితగతిన  పరిష్కార మార్గం చూపెట్టాలని, అపరిష్కృతంగా ఉంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారి బాధ్యలవుతారని స్పష్టంచేశారు. పెండింగ్ ఫిర్యాదులపై లిఖితపూర్తకంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయం మర్చిపోవద్దని హితవు చెప్పారు. గత వారంలో ప్రజావాణికి వచ్చిన అర్జీలపై సమీక్షిస్తూ అధికారులను వచ్చే సోమవారం కల్లా  పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అధికారులు హాజరు తప్పనిసరి ప్రజావాణి కి  అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా హాజరు కావాలన్నారు.అత్యవసర పనులుంటే అనుమతి తీసుకుని వెళ్లాలని స్పష్టం చేసారు . అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రాహుల్ శర్మ, , ఆర్డీవో శ్రీనివాస్ రావు , ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు , తహసిల్ కార్యాలయాల ఉప తహసిల్దార్లు  పాల్గొన్నారు.
Tags:People’s problems should be solved

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *