Natyam ad

జన సైనికుల పోరాటం ఎవరిని ముఖ్యమంత్రిని చేసేందుకు ..? – మంత్రి పెద్దిరెడ్డి వ్యంగాస్త్రం

-బాబుకు పవన్‌బంట్రోత్‌ ఊడిగం చేస్తారా..?

– తేల్చి చెప్పండి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

జన సైనికులు ఎవరిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆరాట పడుతున్నారు. పవన్‌ నా…లేదా చంద్రబాబునా లేదా బాబుకు పవన్‌ బంట్రోత్‌గా ఊడిగం చేస్తారా…? తొలుత తేల్చి చెప్పండి అంటు రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, గనులశాఖామంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యంగాలు సందించారు. గురువారం పట్టణంలోని యుఎన్‌ఆర్‌ సర్కిల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప తో కలసి ఆవిష్కరించారు. అక్కడ జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎల్లోమీడియా, ప్రతిపక్ష నాయకులు కలసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ఆరాట పడుతున్నారని తెలిపారు. పవన్‌కళ్యాణ్‌కు నిలకడ లేదని ఎద్దెవా చేశారు. పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రిగా పోటీకి వస్తారా..? లేదా చంద్రబాబును సీఎం చేసేందుకు బంట్రోత్‌గా ఊడిగం చేస్తారా…అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని జనసేనకు చురకలంటించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జనసేన ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఎవరు ఎన్నికుట్రలు పన్నినా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల ఆశీస్సులతో 151 స్థానాలు గెలుచుకోవడం జరిగిందన్నారు. ఈ ర్ఖా•నికి ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకోదగ్గ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఎవరి ఎన్ని కుట్రలు పన్నినా 2024 ఎన్నికల్లో గత స్థానాలకన్నా అత్యధిక స్థానాలు సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలందరు జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చి ఆశీర్వధించాలని కోరారు.

నాడు ఉయ్యాలవాడ -నేడు జగన్‌…

స్వాతంత్య్ర సమరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒంటరి పోరాటం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అదే స్పూర్తితో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణించిన సమయంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వారిని పరామర్శించేందుకు వెళ్తామంటే వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకుని 16 నెలలు తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టిందన్నారు. కానీ వెహోక్క వోనిదీక్షతో ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేని విధంగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 3400 కిలో మీటర్లు పాదయాత్ర చేసి , పార్టీని గెలిపించారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు పేజిల మ్యానిఫెస్టోలో హామిలను 98.44 శాతం సంపూర్ణంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దేనన్నారు. చంద్రబాబునాయుడు 100 పేజిల మ్యానిఫెస్టోలో 600 హామిలు ఇచ్చి ఒక్కటి కూడ నేరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో కరోనా సమయంలో కూడ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ప్రజలకు సంక్షేమ పథకాలు క్యాలెండర్‌ ప్రకారం అందించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Tags: People’s soldiers struggle to make who the chief minister..? – Minister Peddireddy Satire

 

Post Midle

Leave A Reply

Your email address will not be published.