పుంగనూరు నియోజకవర్గ అభివృద్ది కి జనసైనికులు ముందుంటాం..

పుంగనూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికి మా కృతఙ్ఞతలు తెలిపిన పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి సిరివెలు చిన్నరాయల్.పుంగనూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ ని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన ప్రతి ఒక్క జనసైనికులను గుర్తించి న జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.నేడు తన స్వగృహం లో జనసేన నాయకులు, జనసైనికులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతు మా అధినేత పవణ్ కళ్యాణ్ వారి సూచనలు,ఆదేశాల తో నియోజకవర్గ స్థాయిలో మమ్మల్ని గుర్తించి పదవి భాద్యతలు అప్పగించిన నాటి నుండి నేడు జనసేన పార్టీ రాష్ట్రం లోనె కాకా కేంద్రం లో లో ప్రధానమంత్రి మోడీ వారికి కూడా ముఖ్య మైన పార్టీ గా గుర్తింపు పొందే స్థాయికి మా పవణ్ కళ్యాణ్ గారికి గుర్తింపు రావడం అలాగే ఎన్నికల్లో పోటి చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించగలిగిందన్నారు.నిన్నటి రోజున కేంద్ర పార్టీ కార్యాలయం లో జనసేన పార్టీ పెద్దలతో కలసి పుంగనూరు నియోజకవర్గం లో పార్టీ తరపున కార్యక్రమాల గురించి ప్రజల్లోకి వెళ్లి పార్టీ గెలుపుకు కృషిచేసిన విషయాన్ని వివరించడం జరిగిందన్నారు.ఎవరైతే విజయం సాధించారో వారితో కలసి పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలియజేసే విధంగా నెలకొక సారి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం దృష్టికి వెళ్ళడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతున్నదన్నారు .జనసేన పార్టీ పుంగనూరు నియోజక వర్గ గౌరవ అధ్యక్షులు కె.శివప్ప నాయుడు మాట్లాడుతు పుంగనూరు నియోజకవర్గం నందు జనసేన పార్టీ బలోపేతం చేయడం లో కీలకపత్ర పోషించి ప్రజల్లో పార్టీ పవణ్ కళ్యాణ్ వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెవెల్లడం లో ముందుకు వెళ్లడం జరిగిందని, ఉమ్మడి కూటమి విజయం లో కీలక పాత్ర పోషించిన జనసైనికులు పార్టీ కార్యాచరణలో ప్రజలతో మమేకమై ప్రజల అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు.జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సిరివెలు శ్రీనివాసులు మాట్లాడుతు ఎన్.డి.ఏ కూటమి పార్టీ విజయం తో జనసేన పార్టీ పవణ్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చేందు కు కృషి చేస్తారని తెలియజేసేందుకు జనసైనికులు గా గర్వపడుతున్నామన్నారు.కార్యక్రమం లో జనసేన నాయకులు పాముల హరి,చంద్ర, తిరుమలేషు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:People’s soldiers will lead the development of Punganur constituency.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *