పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం… సర్పంచ్ చౌడప్ప

తుగ్గలి     ముచ్చట్లు:

పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం మరియు మంచి వాతావరణం గ్రామాలలో నెలకొంటుందని బొందిమడుగుల గ్రామ సర్పంచ్ ఎండా చౌడప్ప తెలియజేశారు. గురువారం రోజున తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామంలో పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చౌడప్ప ప్రజలకు తడి మరి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మరియు అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ తడి మరియు పొడి చెత్త బుట్టలను వినియోగించి వీధులను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు తెలియజేశారు.మన రోజు దినచర్యలో భాగంగా మనం వాడి పడేసిన వ్యర్ధాలను తడి మరియు పొడి చెత్తను చెత్త బుట్టల ద్వారా వేరుచేసి చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు ప్రజలకు తెలియజేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వారు తెలియజేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే గ్రామాలు కూడా పరిశుభ్రంగా తయారయ్యి గ్రామాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని వారు ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కౌలుట్లమ్మ,వార్డ్ సభ్యులు వీరేంద్ర,రంగ స్వామి, రహిమాన్, రంగనాథ్,మాబు,సంజీవ రాయుడు, ప్రతాప్ యాదవ్,వాలంటీర్లు సురేష్,రంగ స్వామి,బ్రహ్మయ్య,వీరాంజీ,లోకేశ్వరి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Perfect health with cleanliness … Sarpanch Chaudhary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *