మహిళా భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యానికి పరిపూర్ణత.

-గోసేన సేవా సమితి అద్యక్షులు కట్ట శివ
జగిత్యాల ముచ్చట్లు:
మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లదని మహిళా సమానత్వం సాధించేందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని గోసేన సేవా సమితి అద్యక్షులు కట్ట శివ అన్నారు. మంగళవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ వేదికగా 60 మంది మునిసిపల్  పారిశుధ్య మహిళా కార్మికులకు కట్ట శివ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ మహిళా భాగస్వామ్యం  లేకుండా ప్రజాస్వామ్యం విజయవంతం కాదన్నారు. మనదేశంలో మహిళలకై చట్టాలు తెస్తున్నారన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా మహిళా ప్రయోజనాలను కాపాడడానికి మరిన్ని చట్టాలు చేయాల్సినఅవసరం ఉందన్నారు. మహిళాభ్యుదయానికి మరిన్ని సంస్థలను స్థాపించాల్సిన అవసరం ఉందన్నారు. కరోన కష్ట కాలంలో పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషిచేశారన్నారు. ఇంతటి సేవచేసిన పారిశుధ్య కార్మికులు ఎప్పటికి అభినందనీయులని నా కూతురు కట్ట వాసవి పుట్టిన రోజును వీరందరి మధ్యన జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని
గోసేవ సమితి అద్యక్షులు కట్ట శివ అన్నారు. వీరి వెంట కట్ట సంధ్య, వసంత్, వాసవి, శ్రీరాం, శ్రీధర్, రాజు, ముఖేష్, ఉదయ్ తోపాటు  కార్మికులు ఉన్నారు.
 
Tags:Perfection of democracy with the participation of women

Leave A Reply

Your email address will not be published.