ఓ ఆర్ ఆర్ లో అనుమతి 

Date:21/05/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై బుధవారం అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అర్ధరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతించాలని హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగగా ఓఆర్‌ఆర్‌పై టోల్‌గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలను పాటించాలని వెల్లడించింది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్టాగ్ చెల్లింపులకు అవకాశం కల్పించనున్నారు. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్‌ఎండీఏ సూచించింది. కర్ఫూ అమలులో ఉన్న వేళల్లో ఓఆర్‌ఆర్‌పై కార్లను అనుమతించడం జరగదని అధికారులు స్పష్టపర్చారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికులున్నట్లుగా టోల్ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాలని హెచ్‌ఎండీఏ అధికారులు ఆదేశించారు.

 

 

 

ప్రజారవాణా వ్యవస్థ మొదలుకావడంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లోనూ అన్ని వాహనాల ప్రయాణానికి అనుమతినిచ్చే విషయంలో రెండు విభాగాల ఎదురుచూపులు వాహనదారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి, హెచ్‌ఎండీఏ అధికారులు మాత్రం వాహన రాకపోకలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఇరు కమిషనరేట్ల పోలీసు అధికారులేనని చెబుతున్నారు. వాహన రాకపోకలు మొదలైతే టోల్‌ఫీజు రూపంలో సంస్థ ఖాజానాకు ఆదాయం వస్తుందని, పోలీసుల నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నామని హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులు అంటున్నారు. అయితే.. వాహన రాకపోకలపై ఒకరు నిర్ణయం తీసుకుంటామని మరొకరు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తుండడం వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది.

 

 

 

 

అన్ని సంస్థల కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ సడలింపులో అనుమతినివ్వడంతో నగరంతో పాటు శివారు ప్రాంత రోడ్లపై ప్రయాణం చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయని వాహనచోదకులు మండిపడుతున్నారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా అనుమతిస్తే సమయంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. ఓఆర్‌ఆర్‌లో ప్రస్తుతం నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్య సేవల వాహన రాకపోకలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో  ఓఆర్‌ఆర్‌లో అన్నిరకాల వాహనాలకు అనుమతిస్తారని అనుకున్నారు. ప్రజారవాణా వ్యవస్థకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఓఆర్‌ఆర్‌లోనూ అనుమతి ఉంటుందని వేలాది మంది వాహనదారులు వచ్చారు. కానీ పోలీసులు అనుమతివ్వలేదు.

ఇంటిపోరుతో జగన్ 

Tags: Permission in the ORR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *