వినాయక చవితి పందిళ్ళు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి- ఎస్సై శివప్రసాద్

అలమూరు ముచ్చట్లు:


ఈనెల 31వ తేదీ నుండి జరుగనున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలమూరు మండలంలో గల 18 గ్రామాలుతో పాటు వాటి శివారు గ్రామాల్లో వినాయక పందిళ్ళు, మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పని సరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలియజేశారు. వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటు నిమిత్తం ఆలమూరు పోలీస్ స్టేషన్లోని కంట్రోల్ కౌంటర్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  పోలీస్ సేవా కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలనారు. సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన మీదట అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ సేవా కేంద్రం పని చేస్తుందని అన్ని వివరాలు పొందుపరిచిన అర్జీని అందించాలన్నారు. ఉత్సవాలు సందర్భంగా అసభ్యకర నృత్యాలు ప్రదర్శిస్తే కమిటీ సభ్యులు అందరిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినాయక ఉత్సవ వేడుకల సందర్భంగా ఉదయం గంట మాత్రమే లౌడ్ స్పీకర్ వినియోగించాలని, డీజే సౌండ్స్ పూర్తిగా నిషేదించామని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా ఉత్సవ నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని తెలియజేశారు. ఉత్సవ పందిరిలో జరుపుకునే పూజలు సమయంలో భక్తులు కోవిడ్ నిబంధనలుతో పాటుగా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. వచ్చాక కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని ఎస్సై అన్నారు.

 

Tags: Permission is mandatory for setting up Vinayaka Chavithi canopies – Essay Sivaprasad

Leave A Reply

Your email address will not be published.