ఫంక్షన్ హాల్స్ కు అనుమతి ఇప్పించాలి 

Date:14/06/2020

జగిత్యాల  ముచ్చట్లు:

లాక్ డౌన్ నిబంధనలలో భాగంగా మార్చి 23 నుంచి ఫంక్షన్ హాల్స్ మూసివేయడంతో ఫంక్షన్ హాల్స్ నిర్వహకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ,50 మంది తో ఫంక్షన్ చేసుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్స్ కు ఆనుమతులు ఇప్పించాలని కోరుతూ మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వినతిపత్రం అందజేశారు.ఆనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కోవిడ్ నిబంధనలతో అన్ని వ్యాపారలకు అనుమతిని కల్పించారని తెలిపారు. గత నాలుగు నెలలుగా ఫంక్షన్ హాల్స్ మూతబడి దానిపై ఆధారపడి ఉన్న కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని వివరించారు. కోవిడ్ నిబంధనలతో ఫంక్షన్ హాల్స్ నిర్వహించుకోవడానికి సంబంధించిన అధికారులతో అనుమతిని ఇప్పించాలని ఎమ్మెల్యే ను  కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్  నిబంధనలతో నిర్వహించుకోవడానికి జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో కొక్కుల రమేష్ , బండారి రాజ్ కుమార్, ములాసపు రాజన్న , ముజాహిద్ ఆదిల్ , వేణుగౌడ్ , మహేందర్ , బూసి రాజేందర్ , త్రిలోచన్ రెడ్డి , ఫారుక్ అలీ , కొలగాని వేణు ,సాఖీర్ , లక్ష్మణ్  పాల్గొన్నారు.

 

జూలై 15 నుండి విరాటపర్వం పారాయ‌ణం

Tags:Permission must be granted for function halls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *