Natyam ad

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు జెపివిఎల్ టెండర్ల ద్వారా అనుమతి

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జెపివిఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందింది.జెపివిఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉంది.ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది.కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్ లు పొందారని ,జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఇప్పటికే జెపివిఎల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది.అలా ఎవరైనా ప్రచారం చేసుకున్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా జెపివిఎల్ పోలీస్ శాఖను కోరడం జరిగింది.

 

Post Midle

Tags: Permission through JPVL tenders to carry out sand mining and sales in the state

Post Midle