అనధికార లేఔట్లలో ప్లాట్లకు అనుమతులు ఇవ్వం

Permits to plots in unauthorized layouts

Permits to plots in unauthorized layouts

– కమిషనర్‌ వర్మ

Date:21/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు లేఔట్‌ అనుమతి పొందకుండ అనధికారికంగా ప్లాట్లు విక్రయిస్తున్నారని , అలాంటి వారికి అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శనివారం పట్టణంలోని మదనపల్లె రోడ్డులో గల ఎన్‌జీవో కాలనీ, చెంగాలాపురంలో ఇండ్ల వెనుకన గల లేఔట్‌, బాలాజి •యెటర్‌కు వెళ్లే దారిలో స్లాటర్‌ హౌస్‌కి ఎదురుగా ఉన్న లేఔట్లలో అనధికార లేఔట్లుగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు అనధికార లేఔట్లను రిజిస్ట్రేషన్లు చేయరాదని సబ్‌రిజిస్ట్రార్‌కు లేఖ రాశామన్నారు. అలాగే అనుమతి లేని లేఔట్ల క్రమబద్దీకరణకు 14 శాతం బెటర్‌మెంట్‌ చార్జీలు చెల్లించిన అనుమతులు ఇచ్చేందుకు వీలులేదన్నారు. 2007 సంవత్సరం ముందు ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌లో ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉండేదన్నారు. ఇప్పుడు లేదన్నారు. అలాగే అనధికార లేఔట్ల క్రయవిక్రయాలు జరపరాదన్నారు. ఇందుకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.

 

వర్షాలకు అధ్వాన్నంగా మారిన రోడ్డు

 

Tags: Permits to plots in unauthorized layouts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *