ప్రధాని ప్రారంభాన్ని సవాల్ చేస్తూ పిటిషన్
-తిరస్కరిచిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ ముచ్చట్లు:

కొత్త పార్లమెంట్‌ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఓ లాయర్ పిటిషన్ వేశారు. ఇవాళ పిటిషన్ల లిస్ట్‌లో ఇది ఉన్నప్పటికీ…సర్వోన్నత న్యాయస్థానం విచారణకు అంగీకరించలేదు. పైగా…ఇలాంటి పిటిషన్ వేసినందుకు అసహనం వ్యక్తం చేసింది. “ఇలాంటి పిటిషన్ వేసినందుకు మేమెందుకు మీకు ఫైన్ వేయకూడదు..”? అని వ్యాఖ్యానించింది. విచారణ సమయంలో ధర్మాసనం అసహనానికి గురైంది. ఈ విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. ఇది సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సిన విషయం కాదని స్పష్టం చేసింది. “రాజ్యాంగప్రకారం అధినేత రాష్ట్రపతి అవుతారు. అదే పరిపాలనా పరమైన విషయాల్లోకి వస్తే వాటికి చీఫ్ ప్రధాని మాత్రమే అవుతారు. ఇందులో విచారించాల్సినంత విషయం ఏమీ కనిపించడం లేదు. అందుకే పిటిషన్‌ని తిరస్కరిస్తున్నాం”సుప్రీంకోర్
ఆ తరవాతే పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతినిచ్చారు. కొత్త పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతికి తగిన గౌరవం కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ విలువల్ని కించపరిచారని ఆరోపించారు. లాయర్ జయసుకీన్ ఈ పిటిషన్ వేశారు. ఇప్పటికే 19 పార్టీలు తాము హాజరు కావడం లేదని లెటర్ రాశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మాత్రమే పార్లమెంట్‌ని ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశాయి. కానీ…బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడుతోంది. అసోం ముఖ్యమంత్రి ఈ అంశంపై హిమంత బిశ్వ శర్మ మండి పడ్డారు. ప్రతిదీ రాజకీయం చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. వరుస ట్వీట్‌లతో ఫైర్ అయ్యారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్నీ బైకాట్ చేస్తారా అని ప్రశ్నించారు. “ఈ ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బైకాట్ చేశాయి. రేపు అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్నీ బైకాట్ చేస్తారా..?”- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం.
Tags:Petition challenging the Prime Minister’s inauguration
