దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీంలో పిటిషన్ దాఖలు

Petition filed in Supreme Court on the direction accused encounter

Petition filed in Supreme Court on the direction accused encounter

Date:07/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దిశ ఆత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దిశ కేసులో నిందితులు శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ దగ్గర  జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిందే. సీపీ సజ్జనార్ కథనం ప్రకారం.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తుపాకులు లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపారు. ఎంత వారించినప్పటికీ వాళ్లు వినకపోయేసరికి చివరకు పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో నిందితులు నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

 

“పోస్టర్ ” సినిమా ఫస్ట్ లుక్ విడుదల

 

Tags:Petition filed in Supreme Court on the direction accused encounter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *