టీడీపీ నేతల వినతిపత్రం

విశాఖపట్నం ముచ్చట్లు:

 

మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం అందించారు. తెల్ల రేషన్ కార్డు దారులందరికీ 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం, కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఆర్థికసాయాన్ని అందించాలని వినతి పత్రంలో అధికారులను కోరారు.వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి బకాయిలను వెంటనే చెల్లించాలని,ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుందని పట్నం, పల్లె అనే తేడా లేకుండా వైరస్ చుట్టేసిందని చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు సరిగా లేని కారణంగా వేలాదిమంది మరణించారని కరోనా కట్టడికి వ్యాక్సినే ఏకైక మార్గమని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గందరగోళం నెలకొందని వాపోయారు.మొదటి డోసు కోసం లక్షలాది మంది నిరీక్షిస్తు న్నారని మొదటి డోసు వేసుకున్న వారికి సమయానికి రెండో డోసు దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Petition of TDP leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *