90 కు చేరుతున్న పెట్రోల్

Petrol to the 90s

Petrol to the 90s

Date:14/09/2018
ముంబై ముచ్చట్లు:
ఇంధన ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రూ. 81ని తాకిన పెట్రోల్‌ ధర.. శుక్రవారం మరో 28పైసలు పెరిగి రూ. 81.28కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో 28 పైసలు పెరిగిన పెట్రోల్‌ ధర రూ.88.67కి చేరింది. దీంతో ప్రస్తుతం రూ.90కి మరింత చేరువైనట్లైంది. ఎక్సైజ్‌ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 4.48, డీజిల్‌పై రూ. 4.77 పెరిగింది.
శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు:
నగరం    పెట్రోలు (లీటర్ ధర)        డీజిల్ (లీటర్ ధర)
ఢిల్లీ       రూ.81.28                    రూ.73.30
ముంబయి      రూ.88.67                       రూ.77.82
బెంగళూరు       రూ.83.93                        రూ.75.66
కోల్‌కతా        రూ.83.14                        రూ.75.15
హైదరాబాద్      రూ.86.18                   రూ.79.73
చెన్నై   రూ.84.49                      రూ.77.49
Tags:Petrol to the 90s

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *