పీజీ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ

కడప ముచ్చట్లు:


యోగి వేమన విశ్వవిద్యాల యం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సెమిస్టర్ పరీక్షలు  ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య కె. కృష్ణారెడ్డి  ఏపీజే అబ్దుల్ కలాం కేంద్ర గ్రంథాలయం ఆవరణలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు.  509 మంది విద్యార్థులకు గాను 500 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. కళాశాల ఉప ప్రధానాచార్యులు, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ఆచార్య టి. శ్రీనివాస్,  అదనపు పరీక్షల పర్యవేక్షకులు  డా.లక్ష్మి ప్రసాద్, పరీక్షలను పర్యవేక్షించారు. సిబ్బంది చంద్రమౌళి పాల్గొన్నారు.

 

Tags; PG Exams Check Exam Center

Leave A Reply

Your email address will not be published.