Natyam ad

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు ఫూలే

-బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్


చెన్నూరు ముచ్చట్లు:

భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచనపరుడు కుల వ్యతిరేక సంఘసంస్కర్త అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానుభావులు జ్యోతిరావు పూలే అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు కొండిల్ల శ్రీనివాస్ తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే 132 వర్ధంతిని పురస్కరించుకొని మందమర్రి పట్టణ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు కొండల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ప్రాంతంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా మహాత్మా  జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలలతో సహా అనేక రంగాలలో విస్తరించి మహిళలు, అణగారిన కుల ప్రజలను విద్యావంతులను చేయడంలో  అతని ప్రయత్నంలో భాగంగా అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులుగా మొట్టమొదటిసారి బాలికల కోసం 1848 లోనే బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని అన్నారు. పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజల సమాన హక్కులను పొందడానికి సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారని ఈ సంఘంలో అన్ని మతాలు కులాలు ప్రజలు కూడా చేరవచ్చని చేసిన ఉద్యమంలో పూలే ప్రముఖ వ్యక్తిగా పరిగణించబడ్డారని ఆయన తెలిపారు. బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి వితంతువుల కోసం ఒక ఆశ్రమం కూడా స్థాపించడానికి మొట్టమొదటి భారతీయులలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయిలు ఉన్నారని అన్నారు. జ్యోతిరావు పూలే రచించిన గులాంగిరి పుస్తకాన్ని చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం శిష్యులుగా చేరడం ఆయన రాజకీయ సామాజిక అణగారిన కులాల కోసం చేసిన పోరాటమే అని ఆయన ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ నాయకులు రవి వాల్మీకి, రాయబారపు కిరణ్, బత్తుల సతీష్ బాబు, బల్ల శంకర్, రామినేని సురేందర్, సముద్రాల శ్రీనివాస్, ఎదులపురం రాజు,రాసకట్ల దుర్గ ప్రసాద్,ఎనగందుల శ్రీనివాస్, తిరుపతి, అంబేద్కర్ సంఘం కన్వీనర్ మొయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Phule are the great people who worked for the upliftment of the downtrodden

Post Midle
Post Midle