Natyam ad

శారీరక ఆరోగ్యంతోనే మానసిక ఆరోగ్యం- టిటిడి ఉద్యోగుల ఆటలపోటీల ప్రారంభోత్సవంలో ఈవో   ఎవి.ధర్మారెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

ఉద్యోగులు ఆటలపోటీలు జరిగే సమయంలోనే కాకుండా ప్రతిరోజూ యోగా, ధ్యానం, ఆటలు, వ్యాయామం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యవంతులుగా ఉంటారని, తద్వారా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్‌ మైదానంలో గురువారం ఆయన ఉద్యోగుల ఆటలపోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఈవో మాట్లాడుతూ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉన్నపుడే మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించవచ్చని చెప్పారు. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించి సంస్థ ప్రతిష్టను ఇనుమడింప చేయవచ్చునన్నారు.ముందుగా ఈవో ఉద్యోగుల గౌరవ వందనం స్వీకరించి పావురాలు, బెలూన్లు ఎగురవేసి ఆటలపోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. తరువాత వాలీబాల్‌ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహిస్తారు.జెఈవోలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో  షణ్ముఖ్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌  నాగేశ్వరరావు, విజివో మనోహర్‌, సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో  స్నేహలత పాల్గొన్నారు.

Post Midle

 

Tags:Physical health comes with mental health – EV Dharma Reddy at the opening ceremony of TTD employees’ sports competitions.

Post Midle