Natyam ad

జూన్ 15వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ టోకెన్లు

-వేచి ఉండాల్సిన పనిలేదు – టీటీడీ

 

తిరుమ‌ల ముచ్చట్లు:

Post Midle

తిరుమ‌ల శ్రీ‌వారి అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టోకెన్ల‌ను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్నారు. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులు సౌక‌ర్యార్థం ఇక‌పై టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.ఇందులో భాగంగా జూన్ 15వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

 

Tags;Physical tokens available to devotees online from June 15

Post Midle