జగన్‌ వందరోజుల పాలన పారదర్శకం

Pics Hundred Days Rule Transparent

Pics Hundred Days Rule Transparent

– ఎంపి రెడ్డెప్ప

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్సీపి అధినేత , ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వందరోజుల పరిపాలన ఎంతో పారదర్శకంగా జరుగుతోందని చిత్తూరు ఎంపి ఎన్‌.రెడ్డెప్ప కొనియాడారు. శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణంతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి్య ధ్వర్యంలో నిర్వహించారన్నారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అక్రమలకు తావులేకుండ అర్హులకు మాత్రమే లభించిందన్నారు. ఒకేసారి 1.98 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సీఎం జగన్‌మోహన్‌రె డ్డి దేశంలోనే రికార్డు సృష్టించారని కొనియాడారు. అలాగే ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ల నియామకాల్లో పూర్తిగా పారదర్శకంగా జరిగిందన్నారు. దేశ చరిత్రలో జగన్‌మోహన్‌రెడ్డి తలమానికంగా నిలిచారని అభివర్ణించారు. అలాగే ఉగాధి పండుగ నాటికి 25 లక్షల మందికి పక్కా ఇండ్ల నిర్మాణం, రైతు భరోసా , ఆటోడ్రైవర్లకు, రజకారులకు, నాయిబ్రాహ్మణులను రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రకటించడం హర్షనీయమన్నారు. ముఖ్యమంత్రి వంద రోజుల పాలన ఎంతో ఉత్సాహంగా సాగుతోందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామిలను తూచ తప్పకుండ అమలు పరుస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మాజీ కౌన్సిలర్లు కొండవీటి నాగేంద్ర, అమ్ము, యువజన సంఘ నాయకులు శ్రీనివాసులు, కిజర్‌ఖాన్‌, రాజేష్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

పేదల పాలిట రాబంధులు ….

Tags: Pics Hundred Days Rule Transparent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *