మెల్ బోర్న్ మ్యాచ్ లో జగన్ 

Pics in Mel Bourne Match

Pics in Mel Bourne Match

Date:23/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఒక వ్యక్తిపై అభిమానం పెంచుకుంటే మనం దేశం దాటినా ఆ అభిమానం మాత్రం మన గుండెను దాటి వెళ్లదు. మనం ఎక్కడున్నా మనం అభిమానించే వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోంది. ఆస్ట్రేలియాలో ఉంటోన్న కొంత మంది ఎన్ఆర్ఐలు జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మెల్‌బోర్న్‌లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఎవరూ ఊహించని దృశ్యం ఒకటి కనిపించింది. మెల్‌బోర్న్‌లో ఉంటోన్న కొంతమంది జగన్ అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైసీపీ జెండాలు, ఫ్లెక్సీలు పట్టుకుని గ్యాలరీలో సందడి చేశారు. ‘జగన్ వెంట మేమున్నాం’ అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. మెల్‌బోర్న్‌లో ఉంటోన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు యార్లగడ్డ రమ్య, రాజేష్ శాకమూరి తదితరులు ఇలా పార్టీ బ్యానర్లు, జెండాలతో స్టేడియంలో సందడి చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటూ వారు జగన్ ఫ్లెక్సీలను స్టేడియంలో ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. భారత్, ఆసీస్ మధ్య జరిగిన ఈ రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించాడు. 19 ఓవర్ల వరకు ఆట బాగానే సాగింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. ఇక వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత్ తరఫున ఐదుగురు బౌలర్లు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు.
Tags:Pics in Mel Bourne Match

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *