కరోనా పరీక్షల్లో తెలంగాణ వెనకబడింది

Date:24/09/2020

 

 

హైద్రాబాద్ ముచ్చట్లు

 

గతంలో రోజుకు 40 వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో వివరణ ఇవ్వాలని కోర్టు
కరోనా వైరస్‌కు సంబంధించి వివిధ వర్గాల వారు దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని హైకోర్టు
ధర్మాసనం ప్రశ్నించింది. మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర వరకూ కరోనా పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదని అసహనం వ్యక్తం చేసింది. గతంలో రోజుకు 40 వేల
పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు
అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు కూడా లేవని కోర్టు వ్యాఖ్యానించింది. మిగతా రాష్ట్రాల కన్నా కరోనా పరీక్షల విషయంలో ఎందుకు వెనకబడ్డారో చెప్పాలని ఆదేశించింది.
వెయ్యి మందికి కనీసం మూడు బెడ్లు కూడా లేవని గుర్తు చేసింది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ పడకలు పెంచే ప్రణాళికలు ఉన్నాయో లేదో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు
అక్టోబరు 8కి వాయిదా వేసింది.

 

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ..

Tags:Pics of uncle visiting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *