Pics, Sakshi means Chandrababu shaking in the back

జగన్‌, సాక్షి అంటే చంద్రబాబుకు వెన్నులో వణుకు

– ఎంపీ రెడ్డెప్ప ఎద్దెవా

Date:27/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేరు విన్న , సాక్షి పత్రిక, టీవి అన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతుందని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ఎద్దెవా చేశారు. గురువారం పుంగనూరులో సాక్షి ఆర్‌సీ ఇన్‌చార్జ్ ప్రకాష్‌ ఆధ్వర్యంలో విలేకరులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపి, ధర్నాలో రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు , అతని అనుచరులు కలసి రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజాధనాన్ని దోపిడి చేశారని ఆరోపించారు. ఈ దోపిడిలను ఎప్పటికప్పుడు వెలికితీసి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సాక్షి టీవి, పత్రిక కీలకపాత్ర పోషించిందని కొనియాడారు. దీని కారణంగా చంద్రబాబును రాష్ట్రంలో భూస్థాపితం చేశారని తెలిపారు. అప్పటి నుంచి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపైన , సాక్షి పైన ఆక్కసుతో ఎల్లోమీడియాతో తప్పుడు కథనాలు రాయించుకుంటు చంద్రబాబు అనుచరులను రెచ్చగొట్టేందుకు ప్రజాయాత్రలు చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలో విధి నిర్వహణలో ఉన్న చీఫ్‌ రిపోర్టర్‌ రవిరెడ్డిపై దాడి చేయించారని తెలిపారు. దాడిని ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు ఇకనైనా పద్దతులు మార్చుకోకపోతే రాబోవు రోజుల్లో ప్రజలు మరింత గుణపాఠం నేర్పుతారని తెలిపారు. అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన చంద్రబాబునాయుడుకు మతిబ్రమించి విలేకరులపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ సెం•ల్‌కుమార్‌ వెంటనే చర్యలు తీసుకుని దాడిచేసిన గూండాలను అరెస్ట్ చేయాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో విలేకరులకు పూర్తి రక్షణ కల్పిస్తామని , ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి సహించరని తెలిపారు. ఈ విషయమై ఎవరు ఆందోళన చెందకుండ సంయమనం పాటించాలని కోరారు. ఈసమావేశంలో కెసిటివి అధినేత ముత్యాలు, సీపీఐ కార్యదర్శి మురళి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు నటరాజ, రాజేష్‌, కృపాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

విలేకరులపై దాడులను అరికట్టాలని ధర్నా రాస్తారోకో

Tags: Pics, Sakshi means Chandrababu shaking in the back

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *