వరుస లేఖలతో జగన్

విజయవాడ ముచ్చట్లు:

 

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతోంది.  తాజాగా..  కృష్ణానదిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు ఏపీ సీస్ ఆదిత్య నాథ్ దాస్. భారీ ప్రాజెక్టులు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను కాజేస్తోందని ఫిర్యాదు చేశారు. 8 భారీ ప్రాజెక్టుల ద్వారా 183 టీఎంసీల నీటిని తెలంగాణా అక్రమంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని జల శక్తి శాఖకు ఫిర్యాదు చేశారు.మధ్య తరహా, చిన్న తరహా, ఎత్తిపోతల ప్రాజెక్టులతో తెలంగాణా అనుమతులు లేకుండానే కృష్ణా నది నీటిని వినియోగించుకున్నట్టు లేఖలో సీఎస్ పేర్కొన్నారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామల రావు కూడా కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదనను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదు. కృష్ణాజలాలను తెలంగాణ వాడేస్తోందని.. అడ్డుకోవాలని ఆయన అదే పనిగా ప్రధానికి.. మంత్రులకు.. కేఆర్ఎంబీకి లేఖలు రాస్తున్నా… స్పందన ఉండటం లేదు. ప్రధాని పట్టించుకోకపోయినా లేఖల మీద లేఖలు రాస్తున్న సీఎం జగన్ … ఇప్పటికైనా స్పందిస్తారేమోనని ఆశ పడుతున్నారు. తెలంగాణ సర్కార్ జలవిద్యుత్ ఉత్పత్తి ఆపకపోవడంతో ప్రధానికి ఈ సారి మరింత సుదీర్ఘమైన లేఖను రాశారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కోరారు.

 

 

 

 

 

రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన.. అధికారులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని విజ్జప్తి చేశారు. ఈ సారి లేఖల ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014ను ప్రస్తావించారు. లేఖలోతెలంగాణపై జగన్ పలు ఆరోపణలు చేశారు. కృష్ణా నదిలోని కామన్ రిజర్వాయర్లలో.. నిబంధనల్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని.. పునర్‌విభజన చట్టాన్ని తెలంగాణ గౌరవించడం లేదన్నారు. పదేపదే జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి లేఖపై.. అటు కేంద్రంలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతా జగన్ స్వయంకృతాపరాథమేనని తేల్చేస్తున్నారు. కేసీఆర్‌తో రాజకీయంగా మంచి సంబంధాలు నెలకొల్పుకుని రాష్ట్రం కోసం ప్రధానికి లేఖలు రాస్తే ఏం ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సినవి.. వదిలేసినవి ఏపీ సీఎంకు గుర్తు లేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆస్తుల పంపకం గురించి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. దాదాపుగా ఏపీకి రావాల్సిన ఏడు వేల కోట్ల కరెంట్ బకాయిల గురించీ ఒత్తిడి తీసుకు రాలేదు. గత ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ వేసింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణకు రాగానే.. ఈ ప్రభుత్వం ఆ పిటిషన్ ఉపసంహరించుకుంది. కానీ నిధులు మాత్రం అడగలేదు. ఇప్పుడు కూడా… కృష్ణా నీరంతా సముద్రం పాలవుతూంటే లేఖలతో టైంపాస్ చేస్తున్నారు. ఇద్దరు మిత్రులు రాజకీయం చేసుకుంటున్నారన్న అభిప్రాయంలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి లేదని.. వారే పరిష్కరించుకోవాలని అంటున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: Pics with a series of letters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *