ప్రజలను అభివృద్ధి పరచేందుకు పుంగనూరు, మదనపల్లెలో పైలెట్‌ ప్రాజెక్టులు

Pilot projects in Punganur and Madanapalle to develop people

Pilot projects in Punganur and Madanapalle to develop people

– మెప్మాలోని ఆర్‌పిలను తొలగించేది లేదు
– ఎండి చిన్నతాతయ్య

Date:16/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పుంగనూరు, మదనపల్లె మున్సిపాలిటిల్లో పైలెట్‌ ప్రాజెక్టులను మోడల్‌గా చేపట్టి, మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు పుంగనూరు నుంచి నాంది పలికామని మెప్మా ఎండి చిన్నతాయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌పిల సమావేశానికి ముఖ్యఅతిధిగా ఎండి , జిల్లా పీడి జ్యోతి హాజరైయ్యారు. మదనపల్లె , పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటిలలోని ఆర్‌పిలు, డిఎల్‌వో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వర్మ , పీడీ జ్యోతి కలసి ఎండి చిన్నతాతయ్యకు స్వాగతం పలికి సన్మానించారు. చిన్నతాతయ్య మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ ఆదేశాల మేరకు మున్సిపాటిల్లో నూతన ప్రాజెక్టులను మెప్మా ఆధ్వర్యంలో చేపడుతామన్నారు. మెప్మా ద్వారా మహిళలకు , ప్రజలకు అనువైన వ్యాపారాలను అతి తక్కువ నిధులతో ప్రారంభిస్తామన్నారు. దీనిని మోడల్‌గా తీసుకుని విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారని తెలిపారు. పట్టణంలో చింతపండు ప్రసిద్దిగా ఉన్నందున చింతపండు పరిశ్రమతో పాటు ప్రజలకు అనువైన వ్యాపారాలను చేపట్టేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామన్నారు. తొలి విడతలో పుంగనూరు, మదనపల్లె ప్రారంభిస్తామన్నారు. సుమారు రూ.50 లక్షల లోపు వ్యాపారాలను చేపట్టేందుకు మంత్రితో చర్చిస్తామన్నారు. మహిళా గ్రూపుల బకాయిలు సక్రమంగా చెల్లించాలన్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫి నిధులు తిరిగి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావులేదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇన్‌చార్జ్ కృష్ణవేణి, మెప్మా టౌన్‌ మిషన్‌ కోఆర్డినేటర్లు శ్రీరాములు, రవి, మదు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణ ముఖ్యం….

మహిళలు క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలను సహించేది లేదన్నారు. రికార్డుల నిర్వహణతో పాటు ప్రతి మహిళ క్రమం తప్పకుండ సమావేశాలకు హాజరుకావాలెనని సూచించారు. క్రమశిక్షణ లేకపోతే వ్యవస్థ అప్రతిష్టపాలౌతుందని తెలిపారు. మహిళలను ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం చేయడం మహిళల అభివృద్ధికి నాంది పలకడమేనని కొనియాడారు.

ఆర్‌పిలను తొలగించేది లేదు…

రాష్ట్రంలోని మెప్మాలో పని చేస్తున్న ఆర్‌పిలను ఎవరిని తొలగించేది లేదని , వలంటీర్లతో సమన్వయం చేసుకుని పని చేయాలని మెప్మా ఎండి చిన్నతాతయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎంతో ఉన్నత ఆశయంతో ఉన్నారని తెలిపారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు చేసి, ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. మన సమస్యలను మన ఇంటి వద్దనే గంటల వ్యవధిలో పరిష్కరించేందుకే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్‌పిలు వలంటీర్లతో కలసి పని చేసి, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసి, చైతన్యవంతులను చేయాలన్నారు. ఆర్‌పి పరిధిలో సుమారు 250 గృహాలు ఉంటుందన్నారు.

మారెమ్మకు శ్రావణ శుక్రవార పూజలు

Tags: Pilot projects in Punganur and Madanapalle to develop people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *