మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన గులాబీ బాస్

Pink boss who started the game

Pink boss who started the game

Date:26/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గులాబీ బాస్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. ఆ గేమ్ మాములుగా లేదు. ఇదిగో ఇప్పుడే సర్వే రిపోర్ట్ వచ్చింది. లక్ష మెజారిటీతో మన అభ్యర్థి గెలుస్తున్నారు. అని ప్రచారం మొదలు పెట్టిన గులాబీ బాస్ సోనియా వచ్చి వెళ్ళాక కొత్త గేమ్ కి తెరతీశారు. ఈసారి ఆయన మరింతగా ప్రభావవంతమైన ప్రసంగాలు దట్టిస్తున్నారు. తాజా సర్వేలు చేయించిన నివేదికలు పరిశీలించానని, సోనియా వచ్చి వెళ్ళాక టీఆరెస్ బలం చిత్రంగా మరింత పెరిగిందని, ఇక మనకు తిరుగులేదు అంటూ మొదలు పెట్టారు. ఎన్నికల్లో వంద సీట్లు గ్యారంటీ అని నిన్న మొన్నటివరకు చెప్పుకొచ్చిన గులాబీ పార్టీ అధినేత ఇప్పుడు 103 నుంచి 106 సీట్లు వచ్చేస్తాయని అంటున్నారు. తాజా సర్వేలన్నీ అవే చెబుతున్నాయని పదేపదే ఆదివారం జరిగిన అన్ని సభల్లో చెప్పుకొచ్చారు. ప్రత్యర్థికి దడపుట్టేలా, సొంత పార్టీలో జోష్ నింపేందుకు కెసిఆర్ తన ప్రసంగాల స్టైల్ మార్చేశారు. మొదట్లో మీ ఎమ్యెల్యే అభ్యర్థి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నట్లు గులాబీ అధినేత చెప్పుకొచ్చేవారు.అదికాస్తా పార్టీ డంపింగ్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందంటూ కెసిఆర్ కొత్త మైండ్ గేమ్ ఏమేరకు కారు పార్టీకి పనికొస్తుందో డిసెంబర్ 11 న తేలిపోనుంది. సోనియా తన ప్రసంగంలో ఆంధ్రా ఊసెత్తడాన్ని టీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ సంగతి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేయడానికే సోనియా వచ్చినట్లుగా ఉందని ప్రజల్లోకి బలంగా కేసీఆర్ ఎక్కించేందుకుప్రయత్నిస్తున్నారు.
Tags:Pink boss who started the game

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *