పక్కా ప్లాన్ తో గులాబీ అడుగులు

వరంగల్ ముచ్చట్లు:


జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గ్రౌండ్ వర్క్ ప్రక్కాగా చేసుకుంటున్నారు. ఏ చిన్న సందర్భం వచ్చినా ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించేదుకు కోట్ల రూపాయాలను ప్రకటనలకు కుమ్మరిస్తున్నారు. తాజాగా కేంద్రంలో బీజేపీ అవలంబించిన మీడియా ప్రచారాన్ని తామూ వాడుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ప్రకటన వెలువడగానే సోషల్ మీడియా సేవలను పెద్ద ఎత్తున వినియోగించేలా గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో సోషల్ మీడియాను సమర్థవంతగా ఉపయోగించున్న బీజేపీ తాను అధికారంలోకి రావడాన్ని సులభతరం చేసుకుంది. ఇదే బాటలో టీఆర్ఎస్ పయణించబోతోందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రైతు దీక్ష, తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సొంత రాష్ట్ర మీడియాతో పాటు ఇతర రాష్ట్రాల మీడియాలో జోరుగా ప్రచార కార్యక్రమం నిర్వహించింది.

 

 

వివిధ దినపత్రికల్లో ఫ్రంట్ పేజీ యాడ్లు ఇచ్చుకుంది. బీఆర్ఎస్ విషయంలో సోషల్ మీడియాను భారీ స్థాయిలో ఉపయోగించేలా ప్రణాళికలకు కసరత్తు చేస్తోందట.ఇప్పటికే BRS పేరుతో సామాజిక మాధ్యమాల్లో కొత్త గ్రూపులు హల్ చల్ చేస్తున్నాయి. పీఎం కేసీఆర్, కేసీఆర్ సైన్యం, బీఆర్ఎస్ సైనికులు, కేసీఆర్ సేన అంటూ రచ్చ రేపుతున్నాయి. ఈ ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ఏం సాధించారో వివరించేలా పోస్టులు గంపగుత్తల వెల్లువెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో ప్రచార కార్యక్రమాలు సోషల్ మీడియాను దున్నేసేలా వ్యూహరచన చేస్తున్నారట. మోడీ సర్కార్‌ను టార్గెట్‌గా చేసుకుని అనేక ప్రశ్నలు ఈ గ్రూపుల ద్వారా సంధిస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి గ్రూపులను దేశవ్యాప్తంగా రన్ చేసే ఆలోచన టీఆర్ఎస్ పెద్దలకు ఉందట.ఈ పని కోసం కొన్ని ప్రత్యేక బృందాలను సిద్ధం చేసుకున్నారని, మరికొన్ని టీమ్ లను త్వరలో రిక్రూట్ చేసుకుంటానే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏ రాష్ట్రంలో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలి. ఆ రాష్ట్రాల్లో ముఖ్య నేతలు ఎవరూ అనే జాబితా ఇప్పటికే తయారు చేసుకున్నారని ఈ మేరకు త్వరలో ఆయా రాష్ట్రాల్లో సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారట. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వల్ల దేశం ఏం కోల్పోయిందో వివరించేలా వీరి పని తీరు ఉండబోతోందట

 

Tags: Pink feet with pucca plan

Leave A Reply

Your email address will not be published.