ఓరుగల్లులో గులాబీ పోరు

Date:23/01/2021

వరంగల్ ముచ్చట్లు:

కార్పోరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ అధికార పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కోక్కటిగా బయట పడుతున్నాయి. స్థానిక నాయకుల గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న తీరు ఇబ్బందికరంగా మారుతుంది. అనుచరుల మధ్య ఇంత గొడవ జరిగి.. పార్టీకి మాయని మచ్చగా మారుతున్నప్పటికి, ఏ ఒక్క నేత కూడా వెనక్కి తగ్గకపోవడం అధిష్టానానే అవాక్కయ్యేలా చేస్తుంది.వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోజు రోజుకు గ్రూపు రాజకీయలు పెరుగుతున్నాయి. గత ఎన్నికల సమయానికి ఇక్కడ రెండు గ్రూపులే ఉన్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఉండటంతో రెండు గ్రూపులు నాలుగయ్యాయి. గతంలో ఇక్కడ కొండా దంపతులు.. అప్పట్లో మేయర్‌గా ఉన్న నన్నపనేని నరేందర్‌ మధ్య వార్‌ నడిచేది. ఇప్పుడు నరేందర్‌ ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలు మరిన్ని మలుపు తీసుకున్నాయని చెబుతారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు ఎమ్మెల్యే నరేందర్‌ మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో సాగుతోంది.ఓ వైపు బిజేపీ వరంగల్ లో బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. కొండా దంపతుల అండతో కాంగ్రెసు కూడా తూర్పు నియోజకవర్గంలో పట్టు ఉండటంతో కొంత గట్టి పోటీ ఇవ్వనుంది.

 

 

ఇలాంటి సయయంలో స్థానిక ఎమ్మెల్యే సమన్వయం చేసుకోవాల్సి ఉండగా పోలీసులపై ఒత్తిడి పెంచడంతో వివాదం మరింత ముదురుతుందనే వాదన టిఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తుంది. మరో వైపు ఎర్ర బెల్లి ప్రదీప్ రావు పోలీసులను, పరోక్షంగా ఎమ్మెల్యే పై విమర్శలు చేసిన తీరును కార్యకర్తలు తప్పు పడుతున్నారు.మరో వైపు బస్వరాజు సారయ్య ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన వర్గం కూడా తూర్పులో యాక్టివ్‌ అయిందట. దీంతో తూర్పు టీఆర్‌ఎస్‌లో మూడు ముక్కలాట పంచాయితీ రోడ్డున పడుతోంది. సారయ్యను కాబోయే మంత్రి అని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆయన మాటను కాదనలేక ఇబ్బంది పడుతున్నారట. అయితే ప్రదీప్‌రావు, నరేందర్‌ మధ్య వెలుగు చూస్తున్న తగువే ఎక్కువ తలనొప్పిగా మారుతున్నట్టు సమాచారం. ప్రదీప్‌రావు బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అలా అని ఆయన టీఆర్‌ఎస్‌కు ఇంకా గుడ్‌బై చెప్పలేదు.పైగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు.అనుచరులను ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చుకునేలా ప్రేరేపిస్తున్నారు. తమ వారికి న్యాయం చేయలంటూ పోలీసుల పై ఒత్తిడి పెంచుతున్నారు. ఉప్పు నిప్పుగా మారిన వీరి మధ్య ప్రభుత్వ అధికారులు.. పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారట.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: Pink fighting in poplars

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *