3వ స్థానంలోకి గులాబీ…?

హైదరాబాద్ ముచ్చట్లు:


ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు’ ఉందట తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ తీరు. తెలంగాణలో టీఆర్ఎస్ విజయావకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తుంటే.. దేశ రాజకీయాలలో   చక్రం తిప్పుతానంటూ జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ సన్నాహాలు చేయడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీస్తోందన్న నివేదికలు స్వయంగా కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అటియాస్ పీకే బృందం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మరీ సమర్పించినవే. ప్రశాంత్ కిశోర్ గత ఏడాది డిసెంబర్ నుంచి వరుసగా ఏడు దఫాలు సర్వే చేసి మరీ నివేదిక రూపొందించారు. ఆసర్వేలో కేసీఆర్ పార్టీకి వచ్చే ఎన్నికలలో గట్టి ఝలక్ తప్పదని తేలిందంటున్నారు.  ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని పీకే సర్వేలలో తేలిందని నివేదిక స్పష్టం చేసింది.   పీకే తన బృందం చేసిన సర్వేల ఆధారంగా రూపిందించిన నివేదికను స్వయంగా కేసీఆర్ కు సమర్పించడమే కాకుండా.. పార్టీ బలా బలాలపై పూసగుచ్చినట్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు ప్రగతి భవన్ వర్గాల భోగట్టా. ఆ నివేదిక ప్రకారం కేసీఆర్ కేబినెట్ లో కనీసం 11 మంది మంత్రులకు వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు. అన్నిటి కంటే టీఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలవరపెట్టే అంశమేమిటంటే మెజారిటీ స్థానాలలో పోటీ విపక్షాల మధ్యే ఉంటుందన్నది.అంటే మెజారిటీ స్థానాలలో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడనున్నాయనీ, టీఆర్ఎస్ ది మూడో స్థానమేననీ పీకే నివేదిక స్పష్టం చేసిందని పార్టీ వర్గాల సమాచారం. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందనీ, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందని ఇప్పటికే పరిశీలకులు పలు మార్లు విశ్లేషణలు చేశారు.సిట్టింగ్ లను పక్కన పెట్టి కొత్త వారిని తెరమీదకు తీసుకువచ్చినా పెద్దగా ఫలితం ఉండదని పీకే సర్వే విస్పష్టంగా తేల్చేసింది. ఏతావాతా పీకే సర్వే సారాంశమేమిటంటే.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెరాస మూడో స్థానానికి పరిమితమౌతుందని. అధికారం కోసం కాంగ్రెస్,బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని. దీంతో టీఆర్ఎస్ శ్రేణులలో కలవరం ప్రారంభమైంది. అందుకే జాతీయ పర్టీ, జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడంపై అసంతృప్తి పెల్లుబకుతోంది.  

 

Tags: Pink in 3rd place …?

Post Midle
Post Midle
Natyam ad