Natyam ad

వరంగల్ లో గుంట‌ల లెక్కన రిజిస్ట్రేష‌న్లు..!?

వరంగల్  ముచ్చట్లు:

పొలం భూముల‌ను మ్యాపుల‌పై లే అవుట్ ప్లాట్లుగా చూపుతూ భూ కొనుగోలుదారుల‌కు మ‌స్కా కొడుతున్నారు. గ‌జాల లెక్కన ప్లాట్లు చూపుతూ గుంట‌ల లెక్కన రిజిస్ట్రేష‌న్లు చేస్తున్న రియ‌ల్ ద‌గా ఇది.ఇదెక్కడో ఊరులో కాదు.. హ‌న్మకొండ ప‌ట్టణంలోనే కుమార్‌ప‌ల్లి గ్రామంలో జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. పొలం భూముల‌నే ప్లాట్లుగా మార్చి విక్రయాల‌కు పాల్పడుతున్నారు. హన్మకొండ మండ‌లం పెగడపల్లిడబ్బాల రోడ్డులోని కాకతీయ కెనాల్ కట్ట రోడ్డు కుడి వైపున దిగువన ఉన్న జ్యోతి నగర్ కాలనీలోని ఇళ్ల ప‌క్కన గ‌ల స‌ర్వే నెంబ‌ర్ 170/1/1, 170/1/2, 171/ఏ, 185/1ల‌లోఐదెక‌రాల స్థలంలో ఓ నాన్ లేవుట్ వెంచ‌ర్ వేశారు. ఈ భూములు కుడా ప్రపోస్డ్ లే అవుట్ అంటూ అమ్మకాల‌కు ఆఫ‌ర్లకు ప్రక‌టించ‌డం విశేషం. త్వర‌లోనే అన్ని అనుమ‌తులు వ‌స్తాయ‌ని న‌మ్మబ‌లుకుతూకొనుగోలుదారుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఎస్సారెస్పీ కాల్వ క‌ట్టకు ఆనుకుని ఉన్న స్థలాన్ని 80 ఫీట్ల ర‌హ‌దారిగా మ్యాపులో చూపడం విశేషం. 80′ ఫీట్స్ రోడ్డుతోపాటు తూర్పు మరియు పడమర30/60, 200 గజాల‌తో ప్లాట్లు చేస్తున్నారు. ప్లాట్లను ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్నవారికి త‌క్కువ‌కు అంద‌జేస్తామ‌ని కూడా చెబుతున్న‌ట్లు స‌మాచారంహ‌ద్దురాళ్లు పాతితే అధికారుల దృష్టికివెళ్తుంద‌ని భావించిన స్థల య‌జ‌మానులు.. పేప‌ర్‌పై మ్యాపు చూపుతూ ఇదిగో ఇవే ప్లాట్లు.. ఇలా వ‌స్తాయి..అంటూ కొనుగోలు దారుల నుంచి అడ్వాన్సులు పుచ్చుకుంటున్నట్లు స‌మాచారం.

 

ఐదెక‌రాల విస్తీర్ణంలో దాదాపు 90 ప్లాట్లు చేసిన‌ట్లుగా మ్యాపుపై చూపుతున్నారు. 130 గ‌జాల నుంచి 270 గ‌జాల వ‌ర‌కు ప్లాటింగ్ చేశారు. మొత్తంగా గ‌జాల లెక్కన కొనుగోలుదారుల‌కు మ్యాపుపై చూపుతూ..గ‌జాల లెక్కన స‌ర్వే నెంబ‌ర్లకు బై నెంబ‌ర్లను జోడిస్తూ హ‌న్మకొండ త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియ‌ను పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవ‌హారం రెవెన్యూ అధికారుల‌కుతెలియ‌కుండా ఉండ‌ద‌న్నది కాద‌న‌లేని స‌త్యం.పొలాల భూమిని ప్లాట్లుగా చూపెడుతూ అమ్మకాలు జ‌రుపుతున్న వారిపై వెంట‌నే చ‌ర్యలు తీసుకోవాల‌ని జ‌నాలు కోరుతున్నారు. నివాస స్థలాలుగా పేర్కొంటూ
అమాయ‌క జ‌నాల‌కు పొలాల‌ను అత్యంత ఖ‌రీదుతో అంట‌గ‌డుతున్నారు. ఇలాంటి స్థలాలు కొనుగోలు చేసి ఆ త‌ర్వాత ఇల్లు క‌ట్టుకోవాలంటే అనుమ‌తుల‌కు ఇబ్బందులు ప‌డ‌ట‌మే కాకుండా వ్యయప్రయాసాలు భ‌రించాల్సి వ‌స్తుంది. ఇంటి స్థలం కోసం పైసా పైసా కూడ‌బెట్టుకుని ఆశ‌గా కొనుగోలుకు వెళ్లే సామాన్య మ‌ధ్య త‌ర‌గతి ప్రజ‌లు న‌ష్టపోకుండా టౌన్‌ప్లానింగ్ అధికారులు వెంట‌నే చ‌ర్యలుతీసుకోవాల‌ని కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ టౌన్ ప్లానింగ్ అధికారుల వెంట‌నే స్పందించి ఈ నాన్ లే అవుట్ వెంచ‌ర్‌ను ధ్వంసం చేయ‌డంతోపాటు అనుమ‌తి లేద‌నికొనుగోలుదారులు తెలుసుకునేలా బోర్డులు ఏర్పాటు చేయాల‌ని విద్యావంతులు కోరుతున్నారు.

 

Post Midle

Tags:Pit counting registrations in Warangal ..!?

Post Midle