పార్టీ మారడంలేదు…. ! మంత్రి పితాని సత్యనారాయణ

Pithani Satyanarayana Ice Not Change On The Party

Pithani Satyanarayana Ice Not Change On The Party

 Date:14/03/2019

అమరావతి ముచ్చట్లు:
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను మంత్రి పితాని సత్యనారాయణ ఖండించారు.  తనపై దుష్ప్రచారం తగదన్నారు. వైకాపాలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
పత్రికలో ఈ వార్త వచ్చిన తర్వాత సీఎం తనను పిలిచారని పితాని చెప్పారు. తాను కచ్చితంగా పార్టీ మారనని ఆయనకు వివరించానని తెలిపారు. తొమ్మిది నెలలుగా తనపై ఇలాంటి దుష్ర్పచారం జరుగుతోందని ఆరోపించారు.  వ్యక్తిగతంగా ఎవరికీ నష్టం కలిగించొద్దనే మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.  ‘‘నేను హైదరాబాద్, ఢిల్లీ వెళ్తే తప్పేంటి? హైదరాబాద్ వెళ్లినంత మాత్రాన పార్టీ మారినట్లా?’’ అని ప్రశ్నించారు.  ఇటువంటి వార్తలపై కొందరు పాత్రికేయ మిత్రులు తనకు నేరుగా ఫోన్ చేసి అడిగినందుకు వారిని అభినందిస్తున్నా.
తాను ఏ పార్టీలో ఉన్నానో తెలీకుండానే కొందరు ‘ఇక్కడి నుంచి పోటీ.. అక్కడి నుంచి పోటీ’ అంటూ రాసేస్తున్నారని ఎద్దేవాచేశారు.  ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు తనను ఆశీర్వదిస్తారని పితాని అన్నారు.
Tags:Pithani Satyanarayana is not change the party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *