ప్లాన్ బీతోనే కేసీఆర్ 

Plan Beyonce KCR

Plan Beyonce KCR

-చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు
Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును టార్గెట్ చేశారు. తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తూ తీవ్రమైన విమర్శలు చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీ నేతలు. హైదరాబాద్ అభివృద్ధి అంతా చంద్రబాబే చేశారని చెబుతూ ఉంటారు. తెలంగాణ ప్రజలకు ఎన్నో మేళ్లు చేశారని వివరిస్తూంటారు. అయినా కేసీఆర్… తెలంగాణ ద్రోహిగా చంద్రబాబును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో తానే పెట్టానని చంద్రబాబు చెబితే అది అతిశయోక్తి అవుతుంది. కానీ.. హైదరాబాద్‌ను ఐటీ సిటీగా మార్చడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీన్ని కేటీఆర్ కూడా ఓపెన్‌గా చెప్పారు. హైదరాబాద్ ఐటీ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర తీసి వేయలేమని.. నేరుగా చెప్పారు. అయినా చంద్రబాబును..
కేసీఆర్ .. ఎందుకు టార్గెట్ చేశారు..?. పూర్తిగా రాజకీయమే. కాంగ్రెస్. బీఎస్పీ కలిస్తే.. తమకు నష్టమని.. ఎలా అయితే.. ఉత్తరాదిలో బీజేపీ టెన్షన్ పడుతుందో.. అలాగే… తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ కలిస్తే.. తమకు నష్టమని… టీఆర్ఎస్ భావిస్తోంది. తమకు ఓ సవాల్ గా కాంగ్రెస్ – టీడీపీ కలవడం టీఆర్ఎస్‌కు ఓ సవాల్‌గా మారుతుంది. అది కేసీఆర్‌కు బాగా తెలుసు. ఇలాంటి సమయంలో.. కేసీఆర్‌కు ఈజీ టార్గెట్‌గా చంద్రబాబు కనిపించారు. ఆయనను కారణంగా చూపి సెంటిమెంట్‌ను పెంచుతున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రేపు ఏపీతో ఏదైనా పేచీ వస్తే… ఏపీ వైపు ఉంటారా..? తెలంగాణ వైపు ఉంటారా ..?
అనేది కేసీఆర్ మౌలిక ప్రశ్న. ఏపీ ప్రయోజనాలవైపు చంద్రబాబు ఉంటారు. ఉండాలి. ..! అలాంటప్పుడు తెలంగాణకు నష్టం కదా అనేది టీఆర్ఎస్ వాదన.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లపై ఏపీ అభ్యంతరాలు చెబుతుందన్నది నిజం. ఏపీకి, తెలంగాణకి మధ్య పేచీ రాకపోతే.. ఎలాంటి సమస్య లేదు. కానీ పేచీ వస్తే.. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబునాయుడు ఉండటానికి అవకాశమే లేదు. కానీమహాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉంటారు. టీడీపీ నుంచి ఉండరు.
అదే సమయంలో… తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఉంటే.. ఏపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం కూడా టీడీపీ సభ్యులకు ఉండదు. తెలంగాణ టీడీపీ నేతలు.తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు..కర్ణాటక, తెలంగాణ మధ్య పంచాయతీ వస్తే.. రెండు చోట్ల కాంగ్రెస్ ఉంటుంది. అప్పుడు హైకమాండ్ ఏం చేస్తుంది.న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా అంతే… తెలంగాణ రాజకీయ ప్రయోజనాలు ఉంటే.. తెలంగాణకు వ్యతిరేకంగా.. నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు.
అదే సమయంలో న్యూట్రల్ గా ఉండటానికి అవకాశం ఉంది. ఒక వేళ.. తెలంగాణలో ఎమ్మెల్యేలు లేకపోయినారాజకీయ ప్రయోజనాలు లేకపోతే… మాత్రం పరిస్థితి మారిపోతుంది. తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగ అని మరో వాదన కేసీఆర్ వినిపిస్తున్నారు. ఓటుకు నోటు కేసు బయటకు వచ్చి మూడున్నరేళ్లయింది. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు..? కేసు నమోదు చేసింది..? దర్యాప్తు చేసింది..? ఏసీబీనే. ఆ ఏసీబీనే కేసీఆర్ చేతుల్లోనే ఉంది. దర్యాప్తు చేయాల్సిందేమీ కూడా లేదు. అయినప్పటికీ.. కేసీఆర్ ఎందుకు ఆ కేసును పక్కన పెట్టేశారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై విమర్శలు చేసే ముందుగాకేసీఆర్ ముందుగాఈ ప్రశ్నకు ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఆధారాలు అన్నీ కరెక్ట్ గా ఉంటే.. ఓటుకు నోటు కేసు ఎందుకు కోల్డ్ స్టోరేజీకి వెళ్లింది. ఎవరితో ఏ ఒప్పందం చేసుకుని దాన్ని పక్కన పెట్టారు.?. ఇదంతా చెప్పకుండా.. చంద్రబాబు ఓటుకు నోటు దొంగ అంటే.. లాభం లేదు.తెలంగాణ ద్రోహుల పార్టీ. టీడీపీ అలాంటి పార్టీతో పొత్తులేమిటని ప్రశ్నిస్తున్నారు. అలాంటి ద్రోహుల పార్టీతో 2009లో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు. ఇలాంటి ద్రోహుల పార్టీలో ఒకప్పుడు పదవులు అనుభవించారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చారు. అప్పటి వరకూ.. తెలంగాణ అనుకూల పార్టీగా ఉండి.. ఆ తర్వాత తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందా..?
. చంద్రబాబు కుప్పం నుంచే వచ్చారు.. అప్పట్లో ఆదిలాబాద్ నుంచి రాలేదు… ఎప్పుడైనా ఆయనది చిత్తూరు జిల్లానే. వీటన్నిటితో పాటుకేసీఆర్ రెండు రాష్ట్రాల మధ్య సమస్య వస్తే.. ఏ రాష్ట్రం వైపు చంద్రబాబు ఉంటాడనేది ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్న ఆంధ్ర రాజకీయాల్లో అడగాలి. తెలంగాణ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అయితే.. ఏపీ ప్రయోజనాలు వైపు ఉంటారా..? తెలంగాణ ప్రయోజనాల వైపు ఉంటారా..? అని అక్కడ ప్రశ్నించాలి..! .ఎన్నికల టైమ్‌లో ఎవరికి అనుకూలమైన వాదన వారు వినిపిస్తారు. దానికి లాజిక్‌లు ఉండవు.
Tags: Plan Beyonce KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *