రేవంత్ త పాదయాత్ర కు ప్లాన్

Date:17/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పాదయాత్రల కాలమిది. నేతలంతా పాదయాత్రలతో జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైకాపా అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. గతంలో వైఎస్, చంద్రబాబులు ఇదే పని చేశారు. సిపిఎం అదే పని చేసింది. ఇప్పుడు వారికి తోడుగా రేవంత్ రెడ్డి వచ్చారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి కొడంగల్‌ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయనుండటం ఆసక్తికరంగా మారింది. జనాల్లో క్రేజ్ కోసం ఆయన ఈ పని చేస్తున్నాడు. ఇందుకు ప్రణాళిక సిద్ధమైంది. కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌కు పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు యాత్ర పూర్తి చేయాలనేది నిర్ణయం. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని సమస్యల కోసం ఆయన పాదయాత్ర చేయనుండటంతో మిగతా వారు అభ్యంతరం పెట్టాల్సిన పనిలేకుండా పోయింది. కాంగ్రెస్ నేతలు దీనికి మారు మాట్లాడలేదు. వికారాబాద్‌–కృష్ణా రైల్వే లైన్‌ కోసం యూపీఏ హయాంలో సర్వే నిర్వహించి రూ.750 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.375 కోట్ల చొప్పున భరించాలి. కేంద్రం సరే అన్నా.. తెలంగాణ సర్కార్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫలితంగా రైల్వే లైన్ పెండింగ్ లో ఉంది. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే పని చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఈ రైల్వే లైన్ పూర్తయితే వికారాబాద్‌ నుంచి నస్కల్, పరిగి, దోమ, దాదాపూర్, కోస్గి, నారాయణ పేట్, మక్తల్‌ వరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. కొడంగల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేది డిమాండ్. అంతే కాదు.. సున్నపు నిక్షేపాలు, గనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో రైల్వే లైన్‌ వేస్తే సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే వీలుంది. నారాయణపేట్‌–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం మక్తల్‌ మండలం భూత్పూర్‌ వద్ద నిర్మించడానికి సిద్దమైనా ఇంకా ఆలస్యమవుతోంది. 8.5 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు రూ.1,453 కోట్లతో నిర్మించడానికి సిద్దం కావాలంటున్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్‌–హైదరాబాద్‌ మధ్య దూరం 120 కి.మీ దూరం ఉంది. కాబట్టి రోజుకు 15 కి.మీ పాదయాత్ర చేసేలా ప్లాన్ రూపొందిస్తున్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్ మీదుగా బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్‌ నుండి వికారాబాద్‌ చేరుకుంటారు. అక్కడే కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చి మన్నెగూడ, రంగారెడ్డి జిల్లాలోని చిట్టెంపల్లిచౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే పాదయాత్ర తేది ప్రకటించే వీలుంది. యాత్ర ద్వారా పార్టీలో పట్టు పెంచుకోవడమే కాదు.. ప్రజలను ఆకట్టుకునే వ్యూహం ఉంది.
Tags: Plan to revamp the pavilion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *