వైజాగ్ టూరిజంలో ప్రణాళికల లోపం

Date:16/04/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖను పర్యాటక నగరంగా నిలబెట్టాలని సిఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ, స్పష్టమైన ప్రణాళికలు లేక పర్యాటక ప్రగతి అసాధ్యమవుతోంది. టూరిస్టులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. పర్యాటకుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిధులు వృధా అవడం తప్ప ఎలాంటి లాభం చేకూరడంలేదు. ఇప్పటివరకు నిర్వహించిన బెలూన్‌ ఫెస్టివల్, సౌండ్‌ ఆన్‌ శాండ్స్‌, విశాఖ ఉత్సవ్‌… ఇప్పుడు యాచింగ్‌ ఫెస్ట్‌ వరుసగా ఫెయిల్‌ కావడంతో పర్యటక శాఖపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. విశాఖ టూరిజం పర్యటకులను ఆకర్షించేందుకు చేపట్టిన ఫెస్ట్‌లు అంతగా సక్సెస్‌ అవడంలేదు. విశాఖ సాగర తీరంలో దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన యాచింగ్‌ ఫెస్టివల్‌కు పర్యటకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కేవలం విదేశాల్లో మాత్రమే నిర్వహించే ఈ ఫెస్ట్‌కు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌ వేదికగా విస్తృత ప్రచారం కల్పించారు. ఆరు లక్షల మందికి ఆహ్వానం పంపగా 15 వందల మంది మాత్రమే ఆసక్తి చూపారు. చివరకు 16 మంది మాత్రమే ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. విశాఖ చుట్టూ ఎనిమిది బీచ్‌లు ఉన్నా, పదిహేనేళ్ల క్రితంనాటి పరిస్థితే అక్కడ కనిపిస్తోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించాలంటే ప్రైవేట్ బీచ్‌లు తప్పనిసరి. ప్రస్తుతం బోగాపురంవద్ద సన్ రే, యారాడ బీచ్‌లను ప్రైవేట్ బీచ్‌లుగా మార్చగలిగితే రష్యా పర్యాటకులను ఆకర్షించగలిగే అవకాశం ఉందంటున్నారు. ప్రైవేటు బీచ్‌ల అనే్వషణ కోసం రష్యా టూరిస్ట్ ఏజెంట్లు వచ్చే నెలలో విశాఖకు రానున్నారు. రష్యా టూరిస్ట్‌లకు విశాఖను ఓ షోకేస్‌గా చూపించాలన్నది ఆ దేశ పర్యాటక శాఖ భావిస్తోంది. పొరుగు దేశాలకు విశాఖ ఖ్యాతిని తెలియచేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్, టూర్స్ అండ్ ట్రావల్స్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. పర్యాటకాన్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వ యోచిస్తున్నా, ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు అంటున్నారు. విఇందుకు అనుగుణంగా అధికారులు అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. అలాగే విదేశీ పర్యాటకులు కోరుకునే షేక్స్ బార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. పర్యాటక శాఖ ద్వారా మద్యాన్ని విక్రయిస్తే, విదేశీ పర్యాటకులకు ప్రైవసీ ఉంటుంది.విశాఖలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించటం లేదు. పాత బోట్లతో మమ అనిపిస్తుండటంతో పర్యాటకులను అవి ఆకర్షించలేకపోతున్నాయ. విశాఖలో స్కూబా డైవింగ్ ఏర్పాటు చేస్తామని లెట్స్ వైజాగ్ క్యాంపైన్‌లో పర్యాటక శాఖ చెప్పినా ప్రకటనకే పరిమితమైంది.క్రూయిజ్ టూరిజం విశాఖకు రాకపోవడానికి టాక్స్‌ల ప్రభావమే కారణమంటున్నారు. 15 శాతం జిఎస్‌టి, తొమ్మిది శాతం ఏజెంట్స్ టాక్స్‌తోపాటు, 15 నుంచి 18 వరకూ ఏజెంట్ కమీషన్‌ను టూరిస్ట్ చెల్లించాల్సి వస్తోంది. అలాగే విశాఖ పోర్టులో క్రూయిజ్ నౌకకు ప్రత్యేకించి బెర్త్ లేకపోవడంతో ఔటర్ హార్బర్‌లో ఎక్కువ సమయం నిలిచిపోవలసి వస్తోంది. కొనే్నళ్ల కిందట ఎంఎక్స్ క్రూయిజ్ విశాఖ వచ్చినా ప్యాకేజీ వర్కవుట్ కాకపోవడంతో, క్రూయజ్‌లు రావడం మానేశాయ. ఇక హెలీ టూరిజం పైనా ఆశలు అడుగంటాయ. వీటన్నింటికీ మించి విశాఖకు మూడు పేర్లు ఉండటం వలన పలు ఇబ్బందులు వస్తున్నాయి. విశాఖ, విశాఖపట్నం, వైజాగ్ పేర్లలో ఏదో ఒక పేరునే ఉపయోగించాలన్న ప్రతిపాదనను కూడా కొందరు తెర మీదకు తీసుకువస్తున్నారు.విశాఖకు విదేశీ పర్యాటకులు ఎంతమంది వస్తున్నారన్న లెక్క పర్యాటక శాఖ అధికారుల దగ్గర లేకపోవడం శోచనీయం. గత ఏడాది 98వేల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చినట్టు పర్యాటక శాఖ చెపుతోంది.
Tags:Planning error in Vizag tourism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *