విలువ ఆధారిత ఉత్పత్తుల తయారికి ప్రణాళికలు సిద్ధం

Plans are prepared for value-added products

Plans are prepared for value-added products

Date:12/01/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని  రాష్ట్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సమీక్ష సమావేశం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, జీడిమెట్లలో రాష్ట్ర వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి, మరియు ఎల్. వెంకట్రామ్ రెడ్డి,ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్బంగా పార్థసారథి మాట్లాడుతూ ఖచ్చితమైన పంట లెక్కలు,వెంటనే సేకరించవలసిన అవసరాన్ని చెబుతూ ప్రతి ఉద్యాన పంట తలసరి వినియోగం ఆధారంగా రాష్ట్ర జనాభాకు అవసరమైన పరిమాణాన్ని లేక్కిన్చాలన్నారు. ప్రస్తుత విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పరిగణలోకి తీసుకుని, కొరత ఉన్న పంటలను విస్తీర్ణ పెంపుదల, క్రాప్ కాలనీల ద్వారా తీసుకొనుటకు మరియు అధిక ఉత్పత్తి ఉన్న పంటలను, పంట మార్పిడి ద్వారా ఇతర పంటల సాగును ప్రోత్సహించుటకు మరియు ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పి ఆయా ప్రాంతాలల్లో ఉన్న స్వయం సహాయక మహిళా గ్రూపుల ద్వారా నిర్వహించి ఈ మొత్తం ప్రక్రియ రైతులకు వారు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా రూపొందించటానికి ఈ కార్యక్రమం ఉద్దేశించినదన్నారు.
ఈ సమావేశంలో సూక్ష్మ సేద్య పథకం పై కూడా సమీక్ష జరిగింది. ఈ పథకాన్ని జనవరి 31వ తేదీలోగా పూర్తి చేయవలసిందిగా అందరూ అధికారులను మరియు సూక్ష్మ సేద్య కంపనీలను ఆదేశించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో పథకాన్ని పారదర్శకంగా అమలుచేయవలసిన అవసరాన్ని చెబుతూ ఏవైనా సూక్ష్మ సేద్య కంపనీలు మరియు అధికారులు పొరపాటు చేస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించటం జరిగింది.ఉద్యాన శాఖ విశ్రాంత అధికారులు మరియు అగ్రి హార్టి సొసైటీ సభ్యులు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్, ములుగు మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్లవర్స్ & వెజిటబుల్స్, జీడిమెట్లను సందర్శించి వాటి నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి, గౌరవ కార్యదర్శి,  ఉద్యాన కమిషనర్ గారిని అభినందించటం జరిగింది.
Tags:Plans are prepared for value-added products

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *