గోదావరి-కృష్ణా అనుసందానానికి ప్రణాళికలు

-మంత్రి జగదీష్ రెడ్డి

Date:22/07/2019

కోదాడ  ముచ్చట్లు:

కృష్ణా-గోదావరి నదుల అనుసందానానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు గాను ఇంజినీర్ పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.కోదాడ నియోజకవర్గ కేంద్రంలో 19 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తో పాటు కోటి రూపాయల అంచనా వ్యయం తో 11 వార్డులో నిర్మించ తల పెట్టిన యస్ సి కమ్యూనిటీ హాల్ కు ఆదివారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే విద్యుత్ సంక్షోభానికి ముగింపు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని సస్వశ్యామలాంగ మార్చేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

 

 

 

కోటి యాభై లక్షల ఏకరాలకు నీళ్లు అందించేందుకు గాను ఇంజినీర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన విషయం చారిత్రాత్మక ఘట్టంగా ఆయన వర్ణించారు. అదే విదంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పధకం పూర్తి చేయడం తో పాటు గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసందానం చేసి నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి నీరు అందించాలన్నదే ఆయన తపన అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.అభివృద్ధి లో అది ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మనిచ్చిన చింతమడక అయినా కోదాడ అయినా ఒక్క తీరుగా నిధుల కేటాయింపు ఉంటుందని ఆయన చెప్పారు.

 

 

 

2014 లో కోదాడ లో జరిగిన పొరపాటు 2019 లో ఇక్కడి ప్రజలు సరిదిద్దుకున్నారని దానితో కోదాడ ఇకపై అభివృద్ధి లో పరుగులు పెట్టబోతుందన్నారు.కోరి తెచ్చుకున్న తెలంగాణా లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తాపత్రయం అని అందులో భాగస్వామ్యు లైన ప్రజలు రెండో మారు పట్టం కట్టారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు .ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వెనెపల్లిచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

మాతృభూమి సేవను మరవొద్దు: ఉపరాష్ట్రపతి

Tags: Plans for Godavari-Krishna integration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *